బతుకమ్మ చీరల తయారీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మరమగ్గాల కార్మికులు డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులను నిలిపివేసి, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో పవర్లూమ్స్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.